ఉమ్మడి వరంగల్ జిల్లాలో
నేడు ముఖ్యమంత్రి పర్యటన
చివరి గింజ ధాన్యం కొనుగోలు కేంద్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కెసిఆర్ పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వరంగల్ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించను న్నారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. సమావేశంలో వానాకాలం ధా న్యం కొనుగోళ్లపై కేబినెట్‌లో కూలంకషంగా చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశ కు చేరిందని మంత్రి మండలికి అధికారులు వెల్లడించారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొను గోళ్లు ఆలస్యమైందని వివరించారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు కేంద్రాలను కొనసాగించా లని కేబినెట్ వాన వల్ల పంట నష్టం వరంగల్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నష్టం వాటిల్లింది.
ఈదురుగాలులతో పడిన వర్షం వల్ల జిల్లాలో మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. వడగళ్ల కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి. మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేలరాలింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనూ సుమారు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిరపకాయలు రాలి వరదలో కొట్టుకుపోయాయి. చిట్యాల, మహదేవపూర్, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో కోసి ఆరబోసిన మిర్చి కూడా తడిచింది. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సిఎం కెసిఆర్ రైతులతో మాట్లాడి తగిన భరోసా ఇవ్వనున్నారు.