Wednesday, December 25, 2024

యాదాద్రిలో సిఎం కెసిఆర్ దంపతుల ప్రత్యేక పూజలు..

- Advertisement -
- Advertisement -

 CM KCR Visits Yadadri Temple with Family

యాదాద్రి: యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామిని ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ద‌ర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్య విమాన గోపురమునకు బంగారు తాపడం కోసం ఒక కేజీ పదహారు తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్ కు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, విప్ గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

 CM KCR Visits Yadadri Temple with Family

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News