Sunday, December 22, 2024

యాదాద్రికి నేడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR visits Yadadri today

శివాలయ ఉద్ఘాటన, పంచకుండాత్మక కుంభాభిషేకం
వైభవంగా సాగుతున్న పూజా మహోత్సవాలు

మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై కొలువుదీరిన శ్రీరామలింగేశ్వరస్వామి శివాలయ ఉద్ఘాటనకు సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రానున్నారు. ఈ సందర్భంగా జరిగే పంచకుండాత్మక కుంభాభిషేకం మహోత్సవంలో ఆయనతోపాటు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొంటారు. ఈనెల 20వ తేదీ నంచి 25 వరకు శివాలయలో జరుగుతున్న ఉద్ఘాటనలో భాగంగా ఆదివారం ఉదయం యాగశాల లో పండితులు, అర్చకులు శాస్త్రోక్తం గా పూ జలను నిర్వహించారు. శత రుద్రాభిషేకం, మహారుద్రాపురశ్చరణ, మూలమంత్రనుష్ఠాన వేదహవనం నిర్వహించారు. సాయం త్రం రుద్రహవనం, కూ ర్మశిలా, బ్రహ్మశిలా, పిండి కొస్థాపనము లు, శ్య యాదివాసం పూజలను నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News