Sunday, January 19, 2025

బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

గతంలోకంటే బీఆర్ఎస్ కు ఈసారి రెండుసీట్లు ఎక్కువే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమ పార్టీ  ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో జరగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటుబ్యాంకుగానే వాడుకుంటోందని, దళితులెవరూ కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్కకు ఓటు వేయకూడదని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. భట్టి చుట్టపుచూపుగా మాత్రమే మధిరకు వస్తూ ఉంటారనీ, మధిరను ఆయన పట్టించుకున్న పాపాన పోలేదని కేసీఆర్ విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News