Tuesday, January 21, 2025

కాంగ్రెసోళ్లు రైతుబంధును దుబారా అంటున్నారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

వరంగల్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోకూడా 24 గంటల కరెంట్ ఇస్తలేరని సిఎం కెసిఆర్ తెలిపారు. నర్సింపేటలో ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల చరిత్ర కూడా ప్రజలుకు తెలుసునని, ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని అడిగారు. మంచినీళ్లకు, కరెంటు లేక మనల్ని సావగొట్టింది కాంగ్రెస్ కాదా? అని విమర్శించారు. తెలంగాణ వచ్చిన నాడు కరెంటు, మంచి నీళ్లు లేవని, కృష్ణా, గోదావరి నదు మధ్య ఉన్న తెలంగాణకు మంచి నీళ్ల కష్టాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఐదేళ్లలో నీళ్లు అందియ్యకపోతే బిఆర్‌ఎస్‌కు ఓటేయొద్దని గతంలో చెప్పానని, ప్రతి గిరిజన గూడేనికి, ప్రతి తండాకు, ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ కొనియాడారు.

పట్టుదలతో పని చేసినాం కాబట్టి ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్నామని, తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని, మీ ఓటే వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తదని, ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని, పట్టించుకునే ఎంఎల్‌ఎ ఉంటే తప్ప పనులు కావని, రైతుబంధు ఉండాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలవాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. రైతు బంధు ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామని, రైతు బంధు భూమండలంపై ఎక్కడాలేదని, రైతు బంధును పట్టించిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని కెసిఆర్ కొనియాడారు. రైతులు బాగుపడాలని కష్టపడి పనులు చేశామని, నీటికి పన్నులేదు, పాత బకాయిలు మాఫీ చేశామని, రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రైతు మేలు కోసం ప్రభుత్వానికి నష్టం వచ్చినా పంటను కొంటున్నామని గుర్తు చేశారు. పిసిపి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు దుబారా అంటున్నారని కెసిఆర్ దుయ్యబట్టారు. రైతు బంధు ఉండాల్నా వద్దా అనేది బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటేనే వస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News