Tuesday, January 21, 2025

కెసిఆర్ రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో సిఎం కెసిఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ చుట్టూ కెసిఆర్ కుటుంబం పది వేల ఎకరాలు ఆక్రమించుకుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టడానికి జాగా లేదన్న కెసిఆర్ వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. సొంతవాళ్లకు అప్పగించేందుకు వైన్ షాపులకు ముందే టెండర్లు వేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

Also Read: తెలంగాణ నంబర్ వన్… భూములు ఎందుకు అమ్ముతున్నారు: కిషన్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News