Monday, December 23, 2024

మూడు గంటల కరెంట్‌తో మూడెకరాలు పారుతుందా?: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ వెనుక చరిత్రను ప్రజలు గమనించాలని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నేతలు గెలివాల్సింది కాదని ప్రజలే గెలవాలని, ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ మాట్లాడారు. ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దని సూచించారు. ఉద్యమాలను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అభ్యర్థి గుణగణాలను చూడాలన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, గతంలో రైతులను ఆదుకోవాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం తీసుకొచ్చామని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. కరెంట్ సమస్య అనేది రాష్ట్రంలో లేదని, మూడు గంటల కరెంట్‌తో మూడెకరాలు పారుతుందా? అని ప్రశ్నించారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ధరణితో రైతులకే అధికారం ఇచ్చామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి అలజడులు లేకుండా తెలంగాణ ముందుకు పోతుందని సిఎం కెసిఆర్ కొనియాడారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నేతలు బాధ్యాతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News