Friday, December 20, 2024

సిఎం కెసిఆర్ దేశ్ కీ నేత.. ప్రధాని కావాలి: మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

CM KCR wants PM: Minister Malla Reddy

హైదరాబాద్: వరంగల్ పర్యటనలో ఉన్న కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కార్మిక మాసోత్సవ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కెసిఆర్ ప్రభుత్వమే రాబోతుందన్నారు. బిజెపి నుంచి దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీని ప్రార్థంచానని చెప్పారు. దేశాన్ని భారతీయ జనతా పార్టీ నాశనం చేస్తోందని ఆరోపించారు. కెసిఆర్ ప్రధాని చేయాలని భద్రకాళీ అమ్మను మెక్కానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. దొంగలు దేశాన్ని దొచుకుని విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. దేశంలో మాత్రం పేదలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు అని మంత్రి తెలిపారు. విజయదశమి తర్వాత దేశ రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిపుతారు. సిఎం కెసిఆర్ దేశ్ కీ నేత ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. దళితబంధు అమలు చేయాలని బిజెపి పాలిత రాష్ట్రాలకు మల్లారెడ్డి సవాల్ విసిరాడు. దళితబంధు అమలు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తేల్చిచెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఓర్వలేక బిజెపి, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News