Monday, December 23, 2024

రాష్ట్రపతి ముర్మూకు స్వాగతం పలికిన గవర్నర్, సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపటిక్రితం శ్రీశైలం నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్మూకు గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లు పుష్ప గుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. సిఎం కెసిఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు ఉన్నారు.

కాగా, ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతకాల విడిది చేయనున్నారు.బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్మూ బస చేయనున్నారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది హెలికాప్టర్‌లో శంషాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని, అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తెలంగాణకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News