Thursday, January 23, 2025

తండాలను పంచాయతీలుగా మార్చిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : మారుమూల తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని, గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎంతో కృషి చేస్తున్నారని జెడ్పీప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని అమర్‌సింగ్ తండా, పెద్దమంగ్యా తండా, టీక్యాతండా, బోజ్యాతండా, కొమ్మనపల్లి తండా, హచ్చుతండా, దుబ్బతండా, సోమారపు కుంట తండా, గుడిబండా తండా, జీకె తండాల్లో రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ కార్యాలయంలో గిరిజన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో భోగ్ బండార్ పూజ చేసి జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం గ్రామాభివృద్ధికి సంబంధించిన నివేదికను చదివిన అనంతరం గ్రామ పెద్దలను సన్మానించారు. బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, గిరిజన సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు ధరావత్ జైసింగ్‌నాయక్, మంత్రి వ్యక్తగత సహాయకుడు బానోతు భాస్కర్‌లతో కలిసి జెడ్పీప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి నిధుల వరద పారిస్తుండటంతో ప్రగతి పరుగులు తీస్తుందన్నారు. మా తండాలో మారాజ్యం అనే నినాదంతో ఏళ్లుగా పోరాటం చేస్తున్న గిరిజనుల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

అంతే కాకుండా ప్రతీ గ్రామ పంచాయతీ భవనానికి రూ.ఇరవై లక్షలు మంజూరు చేసిందన్నారు. తండాలకు బీటీ, సీసీ రోడ్లు కల్పించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు అంకూస్, తండాల సర్పంచ్‌లు సురేశ్, శారద రమేశ్, శోభన యాకూబ్, కౌసల్య బోజ్యానాయక్, కాలునాయక్, రమేశ్, సరస్వతి, అచ్చమ్మ సోమ్లానాయక్, యాకమ్మ విజయ్‌కుమార్‌లతో పాటు ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు శంకర్‌నాయక్, ఠాగూర్, అమర్‌సింగ్, బొంద్యాలు, పంచాయతీ కార్యదర్శులు శ్రీను, రాజు, లెనిన్, రవి, నీరజ, అరుణ్, మాధవి, అంగన్‌వాడీ టీచర్లు, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News