Thursday, December 26, 2024

‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునే అవకాశం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కుమురంభీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిఎం బిఆర్ పార్టీ కార్యాలయాన్ని, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గ ఆదివాసీలకు పోటు పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీలకు సిఎం రైతుబంధు చెక్కు అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వడం జరిగిందన్నారు. ఆదివాసీల మీద ఉన్న పోడు భూముల కేసులు ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇంకా కేసులు ఉండటం సరికాదని సిఎం సూచించారు. పోడు భూములకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తామన్నారు. ‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునే అవకాశం ఇస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News