Monday, December 23, 2024

సింగరేణికి ఇచ్చిన హమీలను నెరవేర్చిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జిఎమ్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ షాలేము రాజు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు. అక్కడనుండి జగదాంబసెంటర్‌లోని తెలంగాణతల్లి విగ్రహనికి నివాళులు అర్పించి ఆటపాటలు, బతుకమ్మలతో, కోయ నృత్య డప్పు కళాకారులతో పెద్ద ఎత్తున్న ర్యాలీగా సింగరేణియులు స్ధానిక సింగరేణి జేకే మైదానంకు చేరుకున్నారు.

అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా స్ధానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పాల్గోని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సింగరేణికి ఇచ్చిన హమీలను సిఎం కేసిఆర్ నెరవేర్చారని ఆయన కార్మికుల పక్షపాతి అన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి పుట్టినిల్లు బొగ్గుటకు పూర్వం వైభవం రానున్నదన్నారు. జిఎమ్ షాలేము రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి సింగరేణిలో అనేక సంస్కరణలు చేయబడ్డాయన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయసంస్ధ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎస్వోటు జిఎమ్ మల్లారపు మల్లయ్య, సేవా అధ్యక్షురాలు మధురవాణి, సేఫ్టి ఆఫీసర్ పంజాల శ్రీనివాస్, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు రంగనాధ్, ఏఐటియూసి నాయకులు సారయ్య, ఐఎన్‌టియూసి, బిఎమ్‌ఎస్, హెచ్‌ఎమ్‌ఎస్ నాయకులు లింగాల జగన్నాధం, నాయిని సైదులు, బాల ప్రసాద్, డివైజిఎమ్ మోహన్‌రావు, డివైపిఎమ్ శ్రీహరి, సింగరేణి అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News