Saturday, January 11, 2025

నేడు ముంబైకి…

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌థాక్రే ఆహ్వానంపై
ఆదివారం ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి కెసిఆర్

ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సిఎం మధ్యాహ్నం
ఉద్ధవ్‌థాక్రేతో భోజనం జాతీయ రాజకీయాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనతో చర్చ అనంతరం ఎన్‌సిపి అధినేత
శరద్ పవార్ నివాసానికి వెళ్లనున్న కెసిఆర్ ఆయనతో కూడా దేశ రాజకీయాలపై చర్చించి రాత్రికి హైదరాబాద్‌కు
చేరుకోనున్న ముఖ్యమంత్రి బిజెపియేతర ప్రభుత్వాలను సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రధాని మోడీ
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గత కొంతకాలంగా గళమెత్తుతున్న తెలంగాణ సిఎం ఈ నేపథ్యంలో
కెసిఆర్ ముంబై పర్యటనకు విశేష ప్రాధాన్యం మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్న కెసిఆర్ పిలుపుకి మంచి స్పందన

CM KCR will go to Mumbai

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ స్థాయిలో బిజెపియేతర రాజకీయ పక్షాల ను ఏకతాటిపై తీసుకొచ్చే పనిలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారంనాడు కెసిఆర్ మహారాష్ట్ర రాజధాని ముంబయి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గం టకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధికా రిక నివాసం ‘వర్ష’లో ఆయనతో భేటీ అవుతారు. ఇటీవల సిఎం కెసిఆర్‌కు ఫోన్ చేసి స్వయంగా ఉద్ధవ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆయన ఆహ్వానం మేరకు సిఎం కెసిఆర్ ఉదయం 11 గం టలకు బేంగపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి బయల్దేరి వెళ్తారు. ఉద్ధవ్ థా క్రేతో మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం జా తీయ స్థాయిలో నెలకొన్న తాజా రాజకీయాలు, భ విష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానం గా చర్చించనున్నారని సమాచారం. అనంతరం ఎన్‌సిపి అధినేత శరద్‌పవర్ నివాసానికి కెసిఆర్ వెళ్లనున్నారు. ఆయనతో  కూడా దేశ రాజకీ యాలపై చర్చించిన అనంతరం రాత్రికి సిఎం కెసిఆర్ హైదరాబాద్‌కు చేరుకుంటారు. బిజెపియే తర ప్రభుత్వాలు, సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కొంతకాలంగా సిఎం గళమెత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో వరుస మీడియా సమావేశాల్లో కేంద్రం వైఖరిని ఆయా అంశాల్లో దుయ్యబట్టారు. దాంతో దేశ వ్యాప్తంగా కెసిఆర్‌కు వివి ధ పక్షాల నుంచి మద్దతు వెల్లువెత్తింది. అన్ని రంగాల్లో దేశాన్ని సర్వం నాశనం చేసిన మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని ఆయన చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన లభించింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సిఎం స్టాలిన్, జెడి(ఎస్) నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, వామపక్షాల నుంచి కెసిఆర్‌కు విశేషమైన మద్దతు లభించింది. మోడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని, తాము కూడా మీ వెన్నంటే ఉంటామని ఆయా పక్షాల నేతలు కెసిఆర్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపధ్యంలో సిఎం కెసిఆర్ తాజా ముంబయి పర్యటన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం కానుంది. కాగా సిఎం వెంట ముంబయి పర్యటనకు ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు, పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు కూడా వెళ్లనున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News