Monday, December 23, 2024

నేడు ‘కమాండ్ కంట్రోల్‌’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల

మీదుగా ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం 1:16 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కా ర్యక్రమంలో హోం మంత్రి మహముద్ అలీతో పాటు ప లువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రా రంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారు లు పేర్కొన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఐదు బ్లాక్‌లున్నాయని, 20 అంతస్తుల్లో ‘ఏ’ బ్లాక్, 15 అంతస్తుల్లో ‘బీ’ బ్లాక్ నిర్మించారు. ‘బీ’ బ్లాక్ టెక్నాలజీ ప్యూజియన్ టవర్. ఇందులో అన్ని అంశాలకు సంబంధించిన బ్యాక్‌అప్‌తో కూడిన సాంకేతికత ఉండేలా నిర్మించారన్నారు.

అలాగే డయల్ 100, మహిళల భద్రత, సైబర్ అండ్ నార్కొటిక్స్ క్రైమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఇం దులో ఏర్పాటు చేశారన్నారు. ఇక టవర్ ‘సీ’లో 3 ఫ్లోర్లు నిర్మించారన్నారు. ఈ టవర్ సిలో 480 మంది కూర్చొనే ఆడిటోరియం, టవర్ ‘డీ’లో మీడియా, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్లాక్ ‘ఈ’ లో కమాండ్ కంట్రోల్ అండ్ డాటా సెంటర్ అన్ని విభాగాలను సమన్వయం చేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. సిసిటివి మానిటరింగ్, వార్ రూమ్ అండ్ రిసీవింగ్ రూమ్, 14, 15వ అంతస్తుల్లో తెలంగాణ పోలీసుల చరిత్రను చూపించే విధంగా మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారన్నారు.

దేశానికే తలమానికం ఈ కట్టడం : వేముల

సిఎం కెసిఆర్ మదిలో నుంచి పుట్టిన మరో అద్భుత కట్టడం ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ యావత్ దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా నేడు (గురువారం) ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంఛనంగా ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. దీని ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఆర్ అండ్ బి అధికారు లు, వర్క్ ఏజెన్సీతో కలిసి మంత్రి బుధవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం, ఆడిటోరియంలో వీడియో ప్రజెంటేషన్ ఏర్పాట్లను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని సిఎం కెసిఆర్ భావిస్తారని, గ్రీనరికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతినిధులకు మంత్రి సూచించారు. దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభు త్వం ఆధునిక హంగులతో, నూతన టెక్నాలజీతో నిర్మించిన ఏకైక భవనం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని మంత్రి తెలిపారు.

ఇంతటి చారిత్రాత్మక ఘట్టంలో తనకు భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఈ అశోక్, ఇతర అధికారులు, డిసిపిలు జోయల్ డేవిస్, సునీత, చౌహాన్ పలువురు పోలీ సు అధికారులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.

సిఎం కెసిఆర్ అద్భుత సృష్టి : సివి ఆనంద్

నేడు ప్రారంభం కానున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్ నమూన సిఎం కెసిఆర్ సృష్టి అని నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజానంతో కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ రూపకల్పన చేయ డం జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు కంమాండ్ కంట్రోల్ భవనంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే చోట ఉండాలన్నది సిఎం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఈ బిల్డింగ్ పైన సోలార్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, టవర్ ఏ లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగులు ఉంటారన్నారు. ఏమర్జెన్సీ ఆపరేషన్ కోసం పైన హెలిపాడ్ ఏర్పాటు చేశారన్నారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్ ని సియం కేసిఆర్ ప్రారంభించిన అనంతరం మీటింగ్ హల్ లో మీటింగ్ ఉంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News