Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్లీ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పలు జిల్లాలో నిర్మితమైన స మీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా ఈ నె ల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను కెసిఆర్ అదేరోజున (జనవరి 12) మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సం క్రాంతి పండుగ తర్వాత 18న ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా మంత్రులు, అధికారులు ఆయా ఏర్పాట్లపై దృష్టి సారించి పనులను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News