- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధిపై సిఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇటీవలే కొండగట్టు ఆలయా భివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సిఎం, ఈనెల 14న కొండగట్టులో పర్యటించనున్నారు. ఆలయంలో చేపట్టాల్సిన పునః నిర్మాణ ప నులపై మాస్టర్ ప్లాన్ రూపొందించేందు కు ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆల య అభివృద్దిపై ఆనంద్ సాయి మాస్టర్ ప్లా న్ సిద్ధం రూపొందించనున్నారు.
యాదా ద్రి ఆలయ పునః నిర్మాణ పనులు, ఆలయ గోపురాల డిజైన్స్ రూపొందించింది ఆనం ద్ సాయినే. అందుకే ఇప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్ అభివృద్ధికి సం బంధించిన మాస్టర్ ప్లాన్ ఆయనకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కొండగట్టు దేవాలయం వాహన పూజలతో పాటు ఎక్కువ మంది భక్తులు దర్శించుకు నే ఆలయాల్లో ప్రముఖమైనది.
- Advertisement -