- Advertisement -
కొత్త సంవత్సరంలోనూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతాం
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2022 కొత్త సంవత్సర శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటేటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథా న పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సిఎం అన్నారు. 2022 సంవత్సరంలో కూ డా కష్టాలను అధిగమిస్తూ అదే అకుంఠిత దీక్షతో సుపారిపాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా ముందుకు సాగుతామని సిఎం తెలిపారు. కొత్తఏడాదిలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు.
- Advertisement -