Monday, December 23, 2024

రాష్ట్ర ప్రజలకు ‘సద్దుల బతుకమ్మ’ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR wished 'Saddhula Bathukamma' to people of telangana

 

హైదరాబాద్ : రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు..’సద్దుల బతుకమ్మ’ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటా పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని అన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని సిఎం కెసిఆర్ ప్రార్థించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News