Thursday, January 23, 2025

తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR wishes people on of Bonalu festival

హైదరాబాద్: రాష్ట్ర పండుగైన బోనాల పండుగ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో నేటి నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సాంప్రదాయాలకు రాష్ట్రప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిద్యానికి, పర్యావరణ, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని సిఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సిఎం కెసిఆర్ ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News