Monday, January 20, 2025

దేశ ప్రజలకు సిఎం కెసిఆర్ దీపావళి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

CM KCR wishes the nation a happy Diwali

మన తెలంగాణ/హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సిఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపుకాంతులు ప్రసరింప చేయడమనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందన్నారు. తెలంగాణ మాదిరే, దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖ శాంతులతో సిరి సంపదలతో తుల తూగాలని దీపావళి సందర్భంగా సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. బాణాసంచా వెలిగించే సందర్భంలో ప్రమాదాలకు గురికాకుండా, భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలకు, సిఎం విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News