Monday, December 23, 2024

తమిళనాడు సిఎం స్టాలిన్ కు కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు..

- Advertisement -
- Advertisement -

CM KCR Wishes to MK Stalin on his Birthday

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా స్టాలిన్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, స్టాలిన్ మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. తనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ కు ఎంకె స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.

CM KCR Wishes to MK Stalin on his Birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News