Monday, January 20, 2025

ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలి: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR wishes World Health Day 2022

హైదరాబాద్: ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజారోగ్యం, వైద్యరంగ అభివృద్ధికి భారీగా బడ్జెట్ కేటాయించామని తెలిపారు. వైద్యశాఖలో కొత్తగా 21,073 పోస్టులు భర్తీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటు నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల వద్దకే వైద్యం అనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్న సిఎం అదే స్పూర్తితో తెలంగాణ వ్యాప్తంగా పల్లె దవాఖానాలు ఏర్పాటయ్యాయని సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News