Monday, December 23, 2024

గిరిజనుల సమగ్ర అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

కారేపల్లి: గిరిజనుల సమగ్ర అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సంబరాల్లో భాగంగా కారేపల్లి మండల కేంద్రంలోని వైఎస్‌ఎన్ గార్డెన్స్ లో ఎంపిపి మాళోత్ శకుంతల అధ్యక్షతన, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ద బోయిన ఉమాశంకర్, గిరిజన శాఖల, మండల నాయకుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గిరిజన సంక్షేమ దినోత్సవ నియోజవర్గ స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కారేపల్లి మండలంలో నూతనంగా మంజూరైన 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పైలాన్‌ను కారేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ ను గిరిజనులు లంబాడా, ఆదివాసీల సంప్రదాయలతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కారు చీకట్లో ఉన్న తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ అందించి కాంతి రేఖల వైపు నడిపించిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని, గడప గడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతున్నారని కొనియాడారు . గిరిజనులు తమ సంసృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని, అన్ని కులాల ,మతాల వారిని, వారి పండుగలను సమానంగా గౌరవిస్తూ, అందరి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు అన్నారు. గతంలో 6శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ను 10 శాతానికి పెంచి, గిరిజనుల పాలిట దైవంగా సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయాడని కొనియాడారు. రైతుల కోసం, గిరిజన సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఇదంతా చేశాడన్నారు. అనంతరం గిరివికాస్ ద్వారా మంజూరైన బోర్లు ను 31 మంది లబ్ధిదారులైన రైతులకు అందించారు. ఈకార్యక్రమం లో డిఆర్‌డిఎ పి డి విద్యాచందన, ఏ టి డబ్ల్యూ ఓ నర్సింగ్ తిరుమల రావు, ఎంపిడిఒ చంద్రశేఖర్, ఆర్‌ఐ నరసింహారావు, జడ్పిటిసి వాంకుడోత్ జగన్ నాయక్, మండల పార్టీ కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, వైస్ ఎంపిపి రావూరి శ్రీనివాసరావు, దేవాలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, నాయకులు ముత్యాల సత్యనారాయణ, పసుపులేటి రామారావు, అజ్మీర వీరన్న,తోటకూరి పిచ్చయ్య, బత్తుల శ్రీనివాసరావు, ఎర్రబోడు సర్పంచ్లు కురసం సత్య నారాయణ, మాళోత్ కిషోర్, పార్టీ మండల మహిళా అధ్యక్ష ఉపాధ్యక్షురాళ్లు బానోత్ పద్మావతి,పప్పుల నిర్మల, 16 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఐకెపి, డ్వాక్రా సిబ్బంది, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News