Wednesday, January 22, 2025

ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మఠంపల్లి : ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్షమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మఠంపల్లి మండల పరిదిలోని అంత్యాతండాలో గల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మంజూరైన రూ.17లక్షలతో నిర్మించిన అభివృద్ది పనులను మంగళవారం ప్రారంబించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మన ఊరు- మన బడి పధకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

విద్యార్ధులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోదనతో పాటు మెనూ ప్రకారం భోజనం, అత్యాదునిక వసతులు ప్రభుత్వం కల్పించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధుల సంక్షేమంలో దేశంలో రాష్ట్రం అగ్రస్ధానంలో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్ధులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్ పార్వతి కొండానాయక్,హుజూర్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, జడ్పీటీసి జగన్ నాయక్, మండల విద్యాదికారి పానుగోతు చత్రునాయక్,సర్పంచ్‌లు బాణోతు శాంతి, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి,
ప్రధానోపద్యాయులు మస్తాన్, చిరంజీవి,వేణుగోపాల్,రాజేష్, ఉపాద్యాయులు వెంకటేశ్వర్లు, సైదులు, ఎస్‌యమ్‌సీ చైర్మన్ ధరావత్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News