Sunday, December 22, 2024

రేపు సిఎం కెసిఆర్ రాక

- Advertisement -
- Advertisement -

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, జిల్లా పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు ప్రారంభోత్సవ ఏర్పాట్లను, సిఎం రాక సందర్భంగా వసతులను, హెలిప్యాడ్ నిర్మాణాన్ని పరిశీలించారు. పనుల పురోగతి, ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. మంత్రి వెంట గిరిజన, స్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి మాలోతు కవిత, జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ,కలెక్టర్ శశాంక స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News