Thursday, December 26, 2024

దేవాలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి

- Advertisement -
- Advertisement -

రేగొండ: సమ్మక్క సారలమ్మ, యాదాద్రి పుణ్యక్షేత్రం వైభోగం యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయానికి తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రేగొండ మండలంలో కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా జడ్పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

వారికి ఆలయ అర్చకులు నిర్వాహాకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వాదంతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండలంలో నిర్వహించిన పూజలు చేశారు. ఆలయన అభివృద్ధి సహాయ సహకారాలు అందించిన పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా సన్మానించారు. ఆలయ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దేవాలయంలో పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం అందించడంతో పాటు, వాటి అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక నిధులు మంజూరు చేస్తున్నారని, దేవుళ్ల కృప కటాక్షాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఆలయాలకు ప్రత్యేక శోభ సంతరించుకున్నదని గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంలో అభివృద్ధికి నోచుకోలేదని, నేటి ముఖ్యమంత్రి సహకారాలతో దేశంలోని పలు ఆలయాలకు తలమానికంగా యాదాద్రి నిర్మాణం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలకు నిధులు కేటాయించుకొని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఆలయాలకు దూప దీప నైవేద్యం క్రింద నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని గతంలో 6వేలు కేటాయించిన నిధులు ఆలయ అవసరాలకు సరిపోతలేవనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఇటీవలే పదివేలను ఖరారు చేశారన్నారు.

మిషన్ కాకతీయ చెరువుల పూడిక తీశారని మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో అభివృద్ధి చేశారని ఆసుపత్రుల్లో మౌళిక వసతులను కల్పిస్తూ ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించారన్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ఆధ్మాత్మిక శోభను నలుదిక్కుల ఇనుమడింపజేసేలా, తెలంగాణ రాష్ట్రంలో నలుదిక్కుల ఇనుమడింపజేసేలా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆలయ పునురుద్ధ్దరణ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, జిల్లాలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కొరకు సిఎం కెసిఆర్ కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేశారన్నారు.

అనంతరం గ్రామాలల పురాతన, నూతన ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద జిల్లాలో నూతనంగా 33 ఆలయాలకు దూప దీప నైవేద్య అమలు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, అడిషనల్ కలెక్టర్ దివాకరన్, ఆలయ కమిటీ చైర్మన్ మాదారి అనిత కరుణాకర్‌రెడ్డి, భూపాలపల్లి జడ్పి చైర్మన్ కళ్ళెపు శోభ రఘుపతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్‌గౌడ్, జిల్లా పరిషత్ సిఈఓ విజయలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి సామ్యూల్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్‌రావు, ఎంపిపి పున్నం లక్ష్మీ రవి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, నియోజకవర్గంలోని మండల సర్పంచ్‌లు ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, రైతుబంధు కోఆర్డినేటర్ ఇంగే మహేందర్, గోరికొత్తపల్లి మండలాధ్యక్షుడు మటిక సంతోష్, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News