Wednesday, January 22, 2025

దేవాలయాలు అభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి

- Advertisement -
- Advertisement -

మణుగూరు : దేవాలయాలు అభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బుధవారం మణుగూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయం నందు స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారికి ఆలయ అర్చకులు నిర్వాహకులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న సిఎం కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా నియోజకవర్గ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ సీఎం అయిన తర్వాత దేవాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, దేవాలయాలకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు.

సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మికంగా అన్ని పండగలకు సమ ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కార్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టిందన్నారు. తెలంగాణలో జరుపుకునే ప్రతి పండగలో సర్కార్ సాయ మందించడంలో ముందు వరుసలో ఉందని, దసరా, బతుకమ్మ చీరలు రంజాన్‌కి రంజాన్ తోఫా మసీదులకు మరమ్మతులు క్రిస్మస్ పండుగకు దుస్తులు చర్చిలలో భోజన వసతి ఏర్పాటు చేసి మత పెద్దలకు పారితోషకం ఇచ్చి హక్కున చేర్చుకున్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News