- మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం
కల్వకుర్తి రూరల్ : మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా గుర్తించిన సీఎం కేసిఆర్ అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు బి. జ్యోతి ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ చైర్మన్ సింగం విజయ్‌గౌడ్, మినీ అంగన్‌వాడీ టీచర్లు హాజరయ్యారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ సీఎం కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసి, చిన్నారులను చదువును చక్కగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుఆలు బి. జ్యోతి మాట్లాడుతూ మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా గుర్తించేందుకు కృషి చేసిన రాష్ట్ర మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, గుర్తించిన సీఎం కేసిఆర్‌కు మినీ అంగన్‌వాడీ టీచర్ల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని 216 మిని అంగన్‌వాడీ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలుగా గుర్తించడంతో అదనంగా 216 ఆయా పోస్టులు భర్తీకానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సరోజ, ప్రమీల, భాగ్య, మినీ అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.