Thursday, January 23, 2025

సబ్బండ వర్గాల అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్షం

- Advertisement -
- Advertisement -

మియాపూర్ : సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షం అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. బిసిల ఆర్థిక స్వావలంబనకే బిసి బంధు అని పేర్కోన్నారు. శేరిలింగంపల్లి నియోజవకర్గం పరిధిలోని బిసి, ఎంబిసిల చేతివృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయంను శుక్రవారం మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో రంగారెడ్డి జిల్లా బిసి వెల్ఫేర్ డి ప్యూ టి డైరెక్టర్ విమల దేవి, అసిఎ్టంట్ బిసి వెల్ఫేర్ ఆఫిసర్ నీరజరెడ్డి, రమేష్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు, మంజుల రఘునాథ్ రె డ్డి రోజాదేవి రంగరావులతో కలిసి 300 మంది లబ్ధిదారులకు ఆయన చె క్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన బిసి బంధు ద్వారా కులవృత్తులు పునర్జీవనం పోసుకున్నాయని అన్నారు. నిరంతరం ప్రక్రియగా బిసి బంధు కొనసాగుతుందని, బిసిల ఆర్థిక స్వా వలంబనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, పయ్రతి పైసాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, మొట్టమొదటి సారిగా బిసి కులవృత్తుల కోసం ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని బిసి బంధును కెసిఆర్ ప్రవేశపెట్టిడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడకముందు పదేవేల రూపాయ ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉందేవని, నేడు సిఎం కెసిఆర్ నాయకత్వం లో ఎలాంటి హమీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గం పరిధిలో మిగతవారికి కూ డా విడతల వారీగా బిసి బంధు పథకం ద్వారా లక్ష రూపాయులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మా జీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, పా ర్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటి ప్రతినిధులు, ఉద్యమకారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News