Sunday, January 19, 2025

రేపటితో ముగియనున్న సిఎం కెసిఆర్ సభలు

- Advertisement -
- Advertisement -

నేడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన ప్రజాఆశీర్వాద సభలలో భాగంగా సోమవారం నాలుగు సభలలో పాల్గొననున్నారు. షాద్‌నగర్, చేవెళ్ల, ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 28వ తేదీన (మంగళవారం) వరంగల్(ఈస్ట్, వెస్ట్) సభ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో బిఆర్‌ఎస్ అధినేత పర్యటన ముగియనుంది. గత నెల 15వ తేదీన హుస్నాబాద్ సభతో ప్రారంభమైన ప్రజా ఆశీర్వాద సభలు అప్రతిహతంగా కొనసాగుతూ జన ప్రవాహంతో బిఆర్‌ఎస్ విజయోత్సవాల సభలను తలపిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News