Friday, November 15, 2024

సబ్బండ వర్గాల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం : మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పీర్జాదిగూడ పరిధిలోని ప్రతిఒక్కరు ఈ సంబురాలలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి , పాలకవర్గ సభ్యులు నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబురాల సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

దేశంలో కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పనితీరు చూశామని, వాళ్ల పరిపాలనలో పేదలను కొట్టి పెద్దల కు పెడుతున్నారన్నారని ఆరోపించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గతంలో 200 వందలు ఉన్న పింఛన్ ను కేసీఆర్ పదింతలు పెంచి ఆపన్నులకు ఆసరా అవుతున్నాడన్నారు. కాళేశ్వ రం, మిషన్ కాకతీయ వంటి పథకాలతో నిండు వేసవిలోను తెలంగాణలో చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు.

24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతుందని మల్లారెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రం కాగా, తెలంగాణలో అన్ని మున్సిపాలిటీ లకు పీర్జాదిగూడ ఆదర్శవంతమైన మున్సిపాలిటీ అని మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో కితాబునిచ్చారు.ప్రభుత్వ పథకాలు అందుగుంటున్న అమ్మలు, అక్కలు, చెల్లిండ్లు, అన్నదమ్ములు కేసీఆర్ కు ప్రజలందరూ అండగా ఉండాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల కృషి ఫలితంగా ఇండ్ల పట్టాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేద పిల్లల ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకంను అత్యంత పటిష్టంగా అమలు చేస్తున్నారన్నారు. పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంటేనే సకల జనాల సంక్షేమం ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల వరకు కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

దేశంలో మరెక్కడా లేనన్ని సం క్షేమ పధకాలను అమలు చేస్తూ పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలకు పంచాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని దీవించి మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నేడు రా ష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా కీర్తిని సంపాదించుకోవడంలో ప్రజల భాగస్వా మ్యం మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ వంశీ కృష్ణ,డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ స భ్యులు, నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News