Monday, December 23, 2024

వికలాంగుల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: వికలాంగుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని భూపాలపల్లి జిల్లా భారత్ జాగృతి అధ్యక్షులు మాడ హరీష్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వికలాంగులకు ఇస్తున్న రూ.4116 పెన్షన్‌ను హర్షిస్తూ స్థానిక టిబిజిక్స్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కృతజ్ఞత ర్యాలీని వికలాంగులతో కలిసి నిర్వహించారు. అనంతరం సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అనంతరం మాడ హరీష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో అందించని పెన్షన్ కెసిఆర్ అందిస్తున్నారన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రూ.30 నుండి రూ.70 నుండి రూ. 200 వరకే పరిమితం అయిన నేడు స్వరాష్ట్రంలో రూ.1500 నుండి రూ.3016 నుండి రూ. 4116వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేశారన్నారు. వికలాంగుల జీవితాలలో వెలుగులు ఇస్తున్న కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు కుమారస్వామి గౌడ్, ప్రశాంత్, రఘు, నర్సయ్య, సారక్క, సతీష్, శ్యామ్, రమేష్, రాకేష్, భారత్, జాగృతి నాయకులు అభిలాష్‌రెడ్డి, గాజుల అరున్, సందీప్‌గౌడ్, రాజకుమార్, బొడ్డు సాయికుమార్, సాయి కుమార్, పొక్కురి శ్రీనాథ్, అభిలాష్‌రెడ్డి, వినయ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News