Monday, December 23, 2024

సబ్బండ వర్గాల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: సబ్బండ వర్గాల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయమని జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని శేరిగూడలో సికె కన్వెన్షన్ హాల్‌లో నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఎల్లప్పుడు ప్రజలకు మేలు చేయడానికే కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు చేపట్టాడని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం అవార్డులు, రివార్డులు ప్రకటిస్తుంటే కండ్లుండి చూడలేని వారు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.

ప్రజలకు విశ్వాసంగా సేవ చేస్తున్నామని పనికి రాని వారు ఎన్నికలప్పుడు వచ్చే వారి విమర్శలు పట్టించుకోనవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు క్యామా మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.వి రమణారెడ్డి, రైతు బంధు అధ్యక్షులు వంగేటి లకా్ష్మ రెడ్డి, ఎంపిపి కృపేష్ , మండల పార్టీ అధ్యక్షులు కిషన్‌గౌడ్ , బుగ్గరాములు, రమేష్ గౌడ్ , చీరాల రమేష్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News