Thursday, January 23, 2025

పేద ప్రజలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే సిఎం కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : పేద ప్రజలను ఆర్ధికంగా బలోపేతం చేయటమే లక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పని చేస్తునారని దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన భూత్పూర్ మండల కేంద్రంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3016 నుండి రూ.4016కు పెంచగా ఆ పెంచిన పెన్షన్ ఉత్తర్వులను లబ్దిదారులకు అందజేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 3533 మంది దివ్యాంగులకు పెంచిన పెన్షన్ సుమారు రూ. 35 లక్షల 35వేలను అందించడం జరుగుతున్నదని తెలిపారు.

తెలంగాణ సాధించిన వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నందువల్లనే దివ్యాంగుల పెన్షన్ రూ. 500 నుండి రూ. 4016కు పెరిగిందని, ఎవరు అడగకుండానే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్నీ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని, ప్రజలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను గమనించాలని అన్నారు.

2014కు పూర్వం గ్రామాల పరిస్థితిని ఇప్పటి పరిస్థితిని గమనించాలని, గతంలో తాగడానికి సైతం మంచినీరు దొరికేది కాదని, అలాంటిది ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వడం జరుగుతున్నదని, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ఎన్నో పథకాల అమలు చేస్తున్నామని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరగనంత అభివృద్ది గడచిన తొమ్మిదేళ్లలో జరిగిందని అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 65,000 మంది రైతులకు రైతుబంధు కింద రూ. 902 కోట్ల పెట్టుబడిని అందించడం జరిగిందని తెలిపారు.

ఇదేకాక నియోజకవర్గంలో రూ. 12,500 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఇవ్వడం జరిగిందని, ఆసరా పెన్షన్లు 24వేల నుండి 44000 మందికి పెంచామని, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 100 మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇవ్వడం జరిగిందని, మరో 10,15 రోజుల్లో బ్యాటరీ సైకిళ్లను ఇస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌లు 60 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, అలాగే కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వప్న సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు వారి వికలాత్వాన్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదని అన్ని అవయవాలు సక్రమంగా ఉండి మానసికంగా బాధఫడే వారికన్నా గొప్పవారని అన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ పెంచిన దివ్యాంగుల పెన్షన్‌లు దివ్యాంగులు, ఆత్మ అభిమానంతో బ్రతకడానికి ఉపయోగపడుతాయని, గృహలక్ష్మీ పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు వారికి గృహలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, దేవరకద్ర నియోజకవర్గంలో సుమారు 3500 మందికి, జిల్లా వ్యాప్తంగా 13773 మంది దివ్యాంగుల కుటుంబాలలో పెన్షన్ పెంపు వెలుగులు నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ డిఆర్‌డిఓ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ బసవరాజ్‌గౌడ్ , దేవరకద్ర నియోజకవర్గంలోని మండలాల ఎంపీపీలు, ముడా డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News