Wednesday, January 22, 2025

అన్ని వర్గాల క్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రీతిలో తెలంగాణలో మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాలకు మేలు కలిగేరీతిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం తెలంగాన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాలను నెల్లికుదురు మండల కేంద్రంలో సంక్షేమదినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా నెల్లికుదురుకు చేరుకున్న ఎమ్మెల్యేతో పాటు అధికారులకు మహిళలు, కోలాట బృందాలు పూలు చల్లుతూ నృత్యాలు, పాటలతో బతుకమ్మలు, బోనాలతో అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఆయన సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీలు కూడా మహిళలతో పాటు కోలాటమాడుతూ నృత్యాలు చేస్తూ ఉత్సాహ పరిచారు. అనంతరం సభ వేధికపై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని హట్టహాసంగా ప్రారంభించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సిఎం కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని అనేక హామీలను కూడా నెరవేర్చారని పేర్కోన్నారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు మేలు కలుగచేసేరీతిలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించడంతో పాటు ఆసరా ఫించన్లు దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా ఇస్తున్నారని వివరించారు. వృద్ధ్దులు, వికలాంగులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, ఒంటరి మహిళలు, చేనేత, గీతా కార్మికులు, బోదకాలు, ఏయిడ్స్ బాధితులు, దీర్ఘరోగ భారిన పడ్డ వారికి ఆసరా పింఛన్లు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌ది కాదా అని విపక్షాలను ప్రశ్నించారు. కెసిఆర్ అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించడం తెలంగాణ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ఆసరా ఫించన్లతో గౌరవంగా జీవనం గడుపుతున్న వారందరూ కెసిఆర్‌ను అన్ని వేళల్లోనూ అశీర్వదించాలని పార్థించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వారిని ఆదరించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రం అన్ని విధాలుగా సుభిక్షంగా ఉందని.. రైతులు రెండు పంటలు పండించుకుంటూ రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చివేశారని కొనియాడారు. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ముచ్చటగా మూడో సారి కూడా కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన వృద్ధులు, వికలాంగులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వికలాంగుడికి, వృద్ధులకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ స్వయంగా అన్నం కలిపి తినిపించడం విశేషం. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆర్డీవో డి. కొమురయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, నోడల్ అధికారి సూర్యనారాయణ, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి జిల్లా అద్యక్షులు బాలాజీనాయక్, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, బీరవెల్లి యాదగిరి రెడ్డి, ఎంపీపీ, ఎంపిటీసీలు, సర్పంచ్‌లు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News