Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు పిల్లలమర్రిలో ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చిత్రపటాలకు వికలాంగుల ఆధ్వర్యంలో మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.

వికలాంగులకు 3016 నుండి 4016 రూపాయల పించన్ పెంచడం హర్షనీయమన్నారు. బడుగు జీవులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉందన్నారు. గతంలో చాలిచాలని పింఛన్‌తో వికలాంగులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అంది స్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వికలాంగులకు స్వీ ట్‌లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో బిఆర్‌ఎస్ వార్డు అధ్యక్షుడు బంగారి శ్రీనివాస్, నాయకులు రా పర్తి సైదులు, సోమగాని లింగస్వామి, చెరుకుపల్లి వెంకట్ లాల్, రాపర్తి మహే ష్‌కుమార్, తూటిపల్లి సత్తయ్య, వికలాంగులు దేవరశెట్టి వెంకన్న, కుమ్మరికుంట్ల జానకిరాములు, తూటిపల్లి సైదులు, నరేష్, వెంకన్న, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News