Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ పాలనే శ్రీరామ రక్ష

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని : సిఎం కెసిఆర్ పాలనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రామగుండం దశాబ్ది ప్రగతి బాటను 27వ డివిజన్‌లో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత సిఎం కెసిఆర్ ప్రజాహిత సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి, పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఇక్కడి ప్రజల దశాబ్దాల కలలను సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, కొప్పుల ఈశ్వర్ సహకారంతో నెరవేర్చానని అన్నారు. 2024లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని, సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టనున్నారని అన్నారు.

27వ డివిజన్‌లో రూ. 1.30కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, 336 మందికి ఆసరా ఫించన్లు, కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ 12 మందికి, సిఎంఆర్‌ఎఫ్ నిధి కింద 11లక్షల రూపాయలు అందించామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు కలువల శిరీష సంజీవ్, కల్వచర్ల క్రిష్ణవేణి భూమయ్య, జనగామ సరోజిని, నాయకులు అచ్చ వేణు, ఎండి.జానీ, రహీం బాబు, మల్లారెడ్డి, మధు, సత్యనారాయణ, నరేందర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News