Monday, December 23, 2024

సంక్షేమాల స్వర్ణయుగంలాగా సిఎం కెసిఆర్ పాలన : సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: సంక్షేమాల స్వర్ణయుగంలాగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలో పురాతమైన ఖిల్లా మైసమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.కోటి రూపాయలు కేటాయించిన అభివృద్ధ్దిపై దేవాలయ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, అధికారులతో మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల అకాంక్ష మేరకు అభివృద్ధ్ది పనులు చేస్తున్నారని, మేము హిందువులు చించుకునే నాయకులు దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. చరిత్రలో నిలిచిపో యే విధంగా యాదాద్రి లక్ష్మీ నరిసింహ్మ దేవాలయం నిర్మాణం కెసిఆర్‌కే సాధ్యమైందన్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో ఐదు దేవాలయల కోసం అభివృద్ధికి అడిగిన వెంటనే రూ.5 కోట్ల రూపాయలు మంజూరు సిఎం కెసిఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణులకు, పద్మశాలీలకు , ఆదివాసీలు, ఎస్టీలకు ఆత్మ భవానాలు నిర్మాణ చేపడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధించినందుకు దశాభ్ది ఉత్సవాలు ఒక పండుగగా జరుపుకోవాలన్నారు. నకిలీ విత్తనాల అమ్మే వారిపై పిడీ యాక్టులు కేసులు నమోదు చేయాలని సీఎం కేసిఆర్ సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ్ద ఛైర్మన్ శ్రీధర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా , డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు అరవింద్ శర్మ , బేర బాలకిషన్ , యూత్ వింగ్ మాజీ అధ్యక్షులు కొండల్‌రెడ్డి , మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాంనర్సింహ్మగౌడ్ , శేఖర్ ,దేవేందర్ , సునీతారెడ్డి , మాధవి , స్వప్నరెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News