Thursday, January 23, 2025

మానవీయ కోణంలో సిఎం కెసిఆర్ పాలన

- Advertisement -
- Advertisement -

నల్గొండ:మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం కన్వెన్షన్ హా ల్లో వీఆర్‌ఏలకు రీ- అలాట్మెంట్ ఆర్డర్స్, జూనియర్ పంచాయతీ సె క్రెటరీలకు రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ అందజేసి మాట్లాడారు. మిషన్ భగీరథ పథకం చేపడి తే కూడా కొంత మంది దుర్మార్గులు కేసులు వేశారని, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు గోదావరి నీళ్లు అ ందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు.

దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగు నీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టు పైనా కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని, నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసులు వేస్తున్నారన్నారు. తెలంగాణను 6 0 ఏళ్ళు కాంగ్రెస్, బీజేపీలు సర్వ నాశనం చేసాయని తెలంగాణ రా ష్ట్రం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టడమే కాంగ్రెస్ పని అన్నారు. వీఆర్‌ఏల కష్టాలు అన్నీ ఇన్ని కావని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణం లో నిర్ణయం తీసుకొని రెగ్యులర్ చేశారన్నారు. ఇవి అన్ని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులను మన పల్లెలు దక్కించుకుంటున్నాయన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు చిత్తశుద్ధితో పని చేసి పల్లెలను అందంగా తీర్చిదిద్దారని, ఇ వ్వాళ వాళ్ళను అందరినీ సీఎం కేసీఆర్ శాశ్వత ఉద్యోగులుగా మార్చారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమైన ప్రాజెక్టని, ప్రపంచ ంలో ఎవ్వరు చేయని సాహసం కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ రేయింబవళ్లు కష్టపడి కాళేశ్వరం పూర్తి చేశారన్నారు. ఇవ్వాళ తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం లేనే లేదని, ఇవ్వాళ మనకు మనమే సాటి, పోటీ అన్నారు. మరో 5 ఏళ్ళలో తెలంగాణ ను చూసి అమెరికా సై తం నేర్చుకునేలా అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ లో అ న్ని వర్గాలు, అన్ని కులాలు వాళ్ళు సంతోషంగా ఉన్నారని, గొప్ప మ నవావతా వాదీ, గొప్ప మనసున్న నాయకుడు మన సీఎం కేసీఆర్ అన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, కలెక్టర్ కర్ణన్, ఎస్పీ అపూర్వ రావు, ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నరసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News