Wednesday, December 25, 2024

నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుంది..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకెళ్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. ఈ రాష్ట్రం ఇంత త్వరలో ఇంత బాగైతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.

తాను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుందని చెప్పారు. మనకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంది కాబట్టి.. ప్రజలను మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి ముందుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాలి.. జీవితాలను అర్పించడం కంటే గొప్పత్యాగం మరొకటి ఉండదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను ధారబోసి త్యాగాలు చేశారు కాబట్టి.. దశాబ్ది ఉత్సవాల ముగింపులో వారందరినీ తలచుకోవడం మనందరి కర్తవ్యమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News