Monday, December 23, 2024

విద్యాభివృద్ధికి సిఎం కెసిఆర్ అవిరళ కృషి

- Advertisement -
- Advertisement -

బాలాపూర్:విద్యారంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ,కార్పొరేట్ కన్నా మేటిగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ ఉద్యమనేత,ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ విద్యాభివృద్ధి కోసం అవిరళ కృషి సళుపుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో గల చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విద్యాదినోత్సవంలో మంత్రి సబిత ముఖ్యఅతిథిగా హాజరై మన ఊరు..మన బడి ద్వారా అన్ని రకాల సౌకర్యాలతో ముస్తాబు అయిన జిల్లా పరిషత్ పాఠశాలను ప్రాంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు..మన బడి పాఠశాలలు విద్యాప్రేమికుడు అయిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలని,పథకం ద్వారా విద్యార్థ్ధులకు అవసరం అయ్యే 12 రకాల సౌకర్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దిన వెయ్యి పాఠశాలలను విద్యాదినోత్సవంలో భాగంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 25 లక్షల మంది విద్యార్ధులకు రూ.136 కోట్లతో రెండు జతల ఏకరూప దుస్తులు,రూ.190 కోట్లతో ఉచితంగా పాఠ్యపుస్తకాలు,ఏడాదికి రూ.35 కోట్లతో రాగిజావ అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించినట్లు తెలిపారు.12 లక్షల మంది విద్యార్ధులకు రూ.56 కోట్లతో నోటుపుస్తకాలు,రూ.34.25 కోట్లతో రెండువేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను మంగళవారం అందజేస్తున్నట్లు తెలిపారు.మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 9123 పాఠశాలల్లో రూ.3497.62 కోట్లతో పనులు పూర్తిచేసి రాష్ట్రవ్యాప్తంగామంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర ప్రజాప్రతినిధులు ఏకకాలంలో మంగళవారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో రూ.6 కోట్లతో పాఠ్యపుస్తకాలు,రూ.10.50 కోట్లతో 1.65 లక్షల మంది విద్యార్ధులకు రెండు జతల ఏకరూప దుస్తులు,రూ.5 కోట్లతో 72 వేల మంది విద్యార్ధులకు నోటుపుస్తకాలు,రూ.18.15 లక్షలతో రాగిజావా,రూ.1.6 కోట్లతో 1058 ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను అందజేయనున్నామని తెలిపారు

.గత తొమ్మిదన్నర ఏండ్ల తన పరిపాలనకాలంలో ముక్యమంత్రి కెసిఆర్ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని,రాష్ట్రంలోని 1200 పైచీలకు గల గురుకులాల్లో ఒక్కో విద్యార్ధిపై ఏడాదికి ప్రభుత్వం రూ.1.20 లక్షలను వెచ్చిస్తుందని అన్నారు.దేశం అంతా తెలంగాణవైపు తిరిగిచూసే విధంగా విద్యారంగంలో సంస్కరణలకు నాంది పలుకుతూ డిజిటల్ తరగతి గదులతో పాటు ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ విద్యార్థ్ధులు ప్రపంచ వేదికలపై పోటీపడే విధంగా తయారుకావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ అభిమతం అని,పేద,మధ్యతరగతి విద్యార్ధులు విదేశీవిద్య కళను సాకారం చేసేందుకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను అందిస్తూ,వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా చదువులో వెనుకబడిన విద్యార్ధుల కోసం తొలిమెట్టు కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో 10 జిపిఏ సాధించిన విద్యార్ధులకు సన్మానించి,రూ.10 వేల నగదు ప్రోత్సాహకాలను అందించడంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి,ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ,పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన,రంగారెడ్డి జెడ్‌పిఛైర్‌పర్సన్ తీగల అనితహరినాధ్‌రెడ్డి,రాష్ట్ర గ్రంధాలయ సంస్ధ ఛైర్మెన్ ఆయాచితం శ్రీధర్,అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్,మేయర్ ముడావత్ దుర్గ,డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్ధ ఛైర్మెన్ సత్తు వెంకటరమణరెడ్డి,డిఈఓ సుశీంద్రరావు,పలువురు కార్పొరేటర్లు,కోఆప్షన్‌సభ్యులు,బిఆర్‌ఎస్‌పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News