Thursday, January 23, 2025

హస్తినకు సిఎం

- Advertisement -
- Advertisement -

మూడు రోజులు అక్కడే జాతీయస్థాయి సీనియర్ నాయకులతో చర్చలు

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ మేరకు సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కెసిఆర్ బయలుదేరి రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో దేశ రాజధానికి చేరుకున్నారు. కాగా ఢిల్లీలోనే మూ డు రోజుల పాటు సిఎం కెసిఆర్ ఉం డనున్నట్లుగా తెలుస్తోం ది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతు న్న సమయంలో కెసిఆర్ ఢిల్లీ పర్యటన చేస్తుండడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో కాక రేపుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రం తీరును నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళన లు వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత వారంలో జరిగిన ఐదు రోజు ల సభా కార్యక్రమాలను పూర్తిగా స్తంభింప చేశారు. ఫలితంగా ఎ లాంటి చ ర్చలు జరగకుండానే ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఢిల్లీలో కాలుమోపారు.

ఇదే ఇప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ వేదికగా సిఎం కెసిఆర్ ఏం చేయబోతున్నారన్న అంశంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిని వివిధ అంశాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకొచ్చి….వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారా? లేదా మరోసారి మోడీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించడానికే ఢిల్లీకి వచ్చారా? తదితర అంశాలపై రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ సాగుతోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాలపై పలువురు సీనియర్ నేతలతో కెసిఆర్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా టిఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉండగా త్వరలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సిన సందర్భంలో కొంత మంది విపక్ష నేతలు ఓటింగ్‌కు దూరం అవుతున్న పరిస్థితుల్లో కెసిఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సిఎం వెంట ఢిల్లీ వెళ్లిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ఎల్‌బినగర్ నియోజకవర్గం శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News