Monday, December 23, 2024

మైనార్టీల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి

- Advertisement -
- Advertisement -

మరిపెడ : మైనార్టీల సంక్షేమానికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, వారి ప్రగతి కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. అదివారం ఆయన మరిపెడ మున్సిపాలిటీలో ముస్లింల షాదీఖాన నిర్మాణం కోసం 20 గుంటల స్థలానికి సంబంధించిన పత్రాలను జామా మసీద్ కమిటీ, ముస్లీం మత పెద్దలకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసిందని, వారి మోజంలకు నెలసరి వేతనాలు అందిస్తున్నామన్నారు. అదే విధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం షాదీముబారక్ అందిస్తున్నామని, ప్రతి ఏటా రంజాన్ తోఫాలను అందిస్తున్నామని తెలిపారు.

అదే విధంగా అన్ని వర్గాలతో సమానంగా సముచిత స్ధానం కల్పిస్తూ వారికి ప్రాధాన్య కల్పిస్తున్నామన్నారు. అనంతరం ముస్లీం సోదరులు షాదీఖానా నిర్మాణం కోసం అడగ్గా మంత్రితో మాట్లాడి త్వరలో మంజూరైయ్యేలా చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సింధూర రవినాయక్, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ లతీఫ్, మండల మైనార్టీ అధ్యక్షులు హబీబోద్ధీన్, మౌలనా బదీ ఉజ్జమా, సదర్ రజబ్ అలీ, 14వ వార్డు అధ్యక్షులు మహ్మద్ అఫ్జల్ మీయా, కోఆప్షన్ సభ్యులు మక్సూద్, ఖైరున్ హుస్సేన్, పట్టణ ప్రధాన కార్యదర్శి యాకూబ్‌పాషా, బిఆర్‌ఎస్ నాయకులు సర్ధార్, అవేజ్, మీరా, యాకూబ్ జానీ, జిలాని, జానీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News