Friday, January 3, 2025

ఢిల్లీ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు 5000 మంది పెర్మనెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తే కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీపావళి బహుమతి ఇచ్చారు. 5000 మంది కాంట్రాక్ట్ వర్కర్ల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, ఈ విధానానికి ముగింపు పలకాలనే సంకల్పంతోఆప్ సర్కార్ మొదట్నించీ ఉందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు ఎంతో అవినీతి ఉండేదని, ఇప్పుడు ఉద్యోగులంతా సకాలంలో వేతనాలు పొందుతున్నారని చెప్పారు.

పంజాబ్‌లోనూ తాత్కాలిక ఉద్యోగులు దాదాపు 30 వేల మందిని క్రమబద్ధం చేసినట్టు చెప్పారు. అధికారం లోకి రాగానే తాము తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసే పని చేపట్టామని తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మరో 54 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో విద్యార్థులకు రూ. 1100 అందజేయనున్నది. విదేశీ సంస్థల్లో ప్రిన్సిపాల్స్‌కు శిక్షణ అందిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News