Sunday, December 22, 2024

సిఎం కేజ్రీవాల్ అరెస్ట్?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ మంత్రులు ట్వీట్లు చేశారు. ఇప్పటికే కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే రహదారులను మూసివేశారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ముందు ఆయన ఇంట్లో ఇడి అధికారులు తనిఖీలు చేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని మూడు సార్లు ఇడి కోరినప్పటికి కేజ్రీవాల్ నిరాకరించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మద్యం కుంభకోణం కేసులో విచారణ రావాలని సిఎం కేజ్రీవాల్‌కు ఇడి మూడు సార్లు సమన్లు జారీ చేసింది. నవంబర్ 2, డిసెంబర్21, జనవరి 3వ తేదీని హాజరు కావాలని ఇడి ఆదేశాలు జారీ చేసినప్పటికి కేజ్రీవాల్ నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఆయనపై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశంతో పాటు అరెస్టు కూడా చేయవచ్చు. మద్యం కుంభకోణం కేసులో తనని సాక్షిగా పిలుస్తున్నారా? లేదా అనుమానితుడిగా పిలుస్తున్నారా? అనేది తెలియాల్సి ఉందని పలుమార్లు కేజ్రీవాల్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఉండడంతో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా ఆపాలనే ఉద్దేశంతోనే ఇడి పురిగొల్పిందని ఆప్ నేతలు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News