- Advertisement -
హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై సిఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడి తీరుపై కోర్టును ఆశ్రయిస్తామన్న సిఎం కేజ్రీవాల్. కోర్టులకు ఈడి, సిబిఐ తప్పుడు సమాచారం ఇస్తున్నాయని వాపోయారు. ఈడి విచారణలో కొందరి పేర్లు చెప్పాలని చందన్ రెడ్డిని టార్చర్ చేశారన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో అరెస్టైన వాళ్లను వేధించారన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేజ్రీ ఈ ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థలు అబద్దాలు చెప్పి, ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. సిబిఐ నుంచి తనకు సమన్లు అందినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆ సమన్లను గౌరవిస్తున్నట్లు కూడా చెప్పారు.
- Advertisement -