Monday, November 18, 2024

మోడీకి కేజ్రీవాల్ ఘాటూ లేఖ..

- Advertisement -
- Advertisement -

CM Kejriwal Letter to PM Modi over Singapore Visit

న్యూఢిల్లీ: సింగపూర్‌లో జరగనున్న ఒక సదస్సులో పాల్గొనేందుకు తనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను క్రిమినల్‌ని కానని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినంటూ ఆయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సింగపూర్‌లో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనవలసిందిగా సింగపూర్ ప్రభుత్వం తనకు ఆహానం పంపిందని, ప్రపంచ నాయకుల ముందు ఢిల్లీ మోడల్ అభివృద్ధిని తెలియచేసి మన దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడానికి ఇదో మంచి అవకాశమని ప్రధాని నరేంద్ర మోడీకి ఆదివారం రాసిన ఒక లేఖలో కేజ్రీవాల్ తెలిపారు.

తన సింగపూర్ పర్యటనకు అనుమతి రావడంలో నెలరోజులుగా జరుగుతున్న జాప్యం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చన్న అనుమానాలను కూడా ఆయన తన లేఖలో వ్యక్తం చేశారు. ఈ దేశ పౌరునిగా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తనకు ఉందని, సింగపూర్ వెళ్లకుండా తనను చట్టపరంగా ఎవరూ అడ్డుకోలేరని ఆయన తెలిపారు. సాధారణంగా తాను విదేశీ పర్యటనలు చేయనని, దేశ పురోభివృద్ధికి సంబంధించిన సదస్సు కాబట్టే తాను సింగపూర్‌కు వెళ్లాలని నిర్ణయించానని ఆయన చెప్పారు. ఆగస్టు మొదటివారంలో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో మొదటి రోజు కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ జూన్‌లో కేజ్రీవాల్‌కు ఆహ్వానం పంపారు.

CM Kejriwal Letter to PM Modi over Singapore Visit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News