Sunday, February 23, 2025

మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 3న కేజ్రీవాల్‌ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు హాజరు కావడం లేదని కేజ్రీవాల్‌  ఈడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన సిఎం కేజ్రీవాల్‌ మూడోసారి కూడా గైర్హాజరైనారు.ఈడీ సమన్లపై ఆప్‌ స్పందించింది. దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిఎం కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News