Monday, January 20, 2025

బెంగాల్‌లో ఎంఎల్ఎ లు, మంత్రుల జీతాలు పెంపు

- Advertisement -
- Advertisement -

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేల జీతాలను నెలకు రూ 40 వేల చొప్పున పెంచారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. పెరుగుదలతో ఎమ్మెల్యేల జీతాలు ఇకపై నెలకు రూ 50 ,000 అవుతాయి. ఇప్పటివరకూ ఎమ్మెల్యేలకు వేతనాలు రూ 10 వేల వరకూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎమ్మెల్యేలకు జీతాలు తక్కువగా ఉన్నందునే ఈ పెంపుదలకు దిగినట్లు సిఎం తెలిపారు. కాగా మంత్రుల వేతనాలు ఇప్పుడున్న నెలకు రూ 10,900 నుంచి రూ 50,900కు చేరుతాయి. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇంతవరకూ ఎటువంటి వేతనం తీసుకోవడం లేనందున సిఎం జీతం పెంపుదల విషయం ప్రస్తావనలోకి రాదని ఈ దశలో సిఎం తెలిపారు. అయితే జీతాల విషయం తెలిపిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ,

మంత్రులకు అందే అలవెన్స్‌లు, వాహన ఖర్చులు ఇతర పద్దుల ద్వారా అందే మొత్తాల వివరాలను తమ ప్రకటనలో పొందుపర్చలేదు. అయితే ఓ లెక్క ప్రకారం చూస్తే ఎమ్మెల్యేలకు అలవెన్స్‌లు ఇతర ఖర్చుల పద్దుల కింద, వీరి ప్రజా ఖర్చుల పేరిట నెలకు దాదాపుగా రూ లక్ష వరకూ అందుతున్నాయి. ఇప్పటి జీతం పెంపుదల కలిపితే వీరికి నెలకు రూ 1.21 లక్షలు, మంత్రులకు నెలకు రూ 1.50 లక్షల చొప్పున లభిస్తాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డిఎలు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న దశలో దీని గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు, పనిలో పనిగా మంత్రుల వేతనాలు పెంచడంపై ఉద్యోగ , రాజకీయ వర్గాల నుంచి విమర్శలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News