Friday, December 20, 2024

మమతా బెనర్జీ డాన్స్ చేసిన వేళ!(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఎప్పుడూ సీరియస్ గా ఉండే వెస్ట్ బెంగాల్ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరదాగా స్టెప్పులేయడం ఎవరైనా చూశారా?.. కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన 29వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వింత చోటు చేసుకుంది.

కార్యక్రమానికి బాలీవుడ్ అగ్రతారలు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, శతృఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా, మహేశ్ భట్ తదితరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వీరంతా కలసి వేదికపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. నేపథ్యంలో థీమ్ సాంగ్ ప్లే అవుతుంటే, సల్మాన్ ప్రభృతులు స్టెప్పులు వేయడం మొదలెట్టారు. వేదికపైనే ఉన్న మమతా బెనర్జీని మహేశ్ భట్ చేయి పట్టుకుని ముందుకు తీసుకొచ్చారు. దాంతో మిగతావారు డాన్స్ చేస్తుంటే, మమతా బెనర్జీ డాన్స్ చేస్తున్నట్లుగా చేతులూపుతూ నవ్వుతూ పాల్గొన్నారు. ఇక సల్మాన్ ఖాన్ గురించి చెప్పక్కర్లేదు. దబాంగ్ లో మాదిరిగా తనదైన శైలిలో డాన్స్ చేస్తూ, ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News